|
Rank: Advanced Member Groups: Registered
Joined: 2/27/2010 Posts: 260 Points: 789
|
“ Dreams feel real while we’re in them. It’s only when we wake up that we realize something was actually strange”
- Cobb in INCEPTION
నీ కలల్లోకి నేను జొరబడగలిగితే…!
నీకే తెలియని నీ ఆలోచనల్ని నేను దొంగిలించగలను.
నేనే నీ మనసులో ఒక కొత్త ఆలోచనను నింపాలంటే?!
నీ కలల్లోంచీ నిన్ను మరో కల కనేలా ఉసిగొల్పాలి.
అది సాధ్యమా?
‘సాధ్యమే…నిజంలోంచీ కలవరకూ, కలనుంచీ ఒక సామూహిక స్వప్నం వరకూ….
సామూహిక స్వప్నం నుంచీ మరో కలలోకి అలాఅలా జారడం సాధ్యమే. మనసులోని ఆలోచనల్ని దొంగిలించడమే కాదు కొత్త ఆలోచనల్ని సృష్టించడమూ సాధ్యమే’ అంటాడు దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ ‘ఇన్సెప్షన్’ చిత్రంలో.
కానీ సమస్యల్లా, నిజంలా అనిపించే కలలో “జీవించిన”తరువాత నిజానికీ కలకూ బేధం మిగిలుంటుందా అనేదే. దానికి సమాధానం అంత సులభంగా దొరకదు.
మరి సమాధానం లేని సమస్యని అవసరంకోసం ఆహ్వానిస్తే…పరిణామాలు ఎలా ఉంటాయి? అనేదే ఈ సినిమా.
మ్యాట్రిక్స్ సినిమా తరువాత cinematic imagination ని మరోస్థాయికి తీసుకెళ్ళిన చిత్రమిది. ఈ సినిమాను ఒకసారి చూసి సమీక్షించడం, రెండుసార్లు చూసి విశ్లేషించడం లాంటి సాహసాలు చెయ్యడానికి నేను పూనుకోకూడదని తెలిసొచ్చి, కేవలం “చూడండి” అని చెప్పడానికి ఇది రాస్తున్నాను.
చూడబోయే ముందు ఒక్క మాట, ఈ సినిమా ఒకసారి చూస్తే అద్భుతమైన కలలా ఉంటుంది. థియేటర్ బయటొచ్చిన తరువాత అనుభవం లీలగా తెలిసొస్తుందిగానీ, వివరాలు గుర్తుకు రావు. ఎంత అర్థమయ్యిందో అస్సలు అంచనాకు రాదు. అందుకే, ఈ సినిమాని నిజంలా ఫీలవ్వాలంటే కనీసం మరో మూడుసార్లు చూడాలి. అందుకు మీరు రెడీగా ఉంటే GO AHEAD…SEE IT…DREAM IT.
|